“హ్యాపీ బర్త్ డే” డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్!

Published on Jul 8, 2022 10:30 pm IST

లావణ్య త్రిపాఠి లేడీ లీడ్ రోల్ లో, నరేష్ అగస్త్య, సత్య, వెన్నెల కిషోర్, గుండు సుదర్శన్ లు కీలక పాత్రల్లో రితేష్ రానా దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం హ్యాపీ బర్త్ డే. ఈ చిత్రం పలు వినూత్న ప్రమోషన్స్ తర్వాత నేడు థియేటర్ల లో విడుదల అయ్యింది. ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటిటి దిగ్గజం అయిన నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్ తో క్లాప్ ఎంటర్ టైన్మెంట్ పతాకం పై ఈ చిత్రాన్ని చిరంజీవి మరియు హేమలత పెదమల్లు నిర్మించడం జరిగింది. కాల భైరవ ఈ చిత్రానికి సంగీతం అందించగా, కార్తీక శ్రీనివాస్ ఎడిటర్ గా, సురేష్ సరంగం డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ గా వ్యవహరించారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు సినిమా పై హైప్ తీసుకొని రావడం తో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :