బాక్సాఫీస్ వద్ద కష్టాల్లో పడిన ‘హ్యాపీ బర్త్ డే’ !

Published on Jul 11, 2022 7:30 pm IST

‘మత్తు వదలరా’ సినిమాతో డైరెక్టర్‌గా హిట్ అందుకున్న రితేష్ రానా దర్శకత్వంలో వచ్చింది ‘హ్యాపీ బర్త్‌ డే’ సినిమా. అందాల భామ లావణ్య త్రిపాఠి లీడ్ రోల్‌ లో నటించిన సినిమా ఇది. హిట్ డైరెక్టర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై లావణ్య ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ దురదృష్టవశాత్తు, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ ను రాబట్టలేకపోతుంది.

థియేటర్లలో ప్రేక్షకుల హడావుడి పెద్దగా లేదు. ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో సరైన ఆక్యుపెన్సీ దొరకలేదు. నిజానికి, పోయిన శుక్రవారం విడుదలైన ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపలేకపోయింది. ఈ కామెడీ మూవీలో నరేష్ అగస్త్య, వెన్నెల కిషోర్, సత్య, సుదర్శన్, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. మొత్తానికి హ్యాపీ బర్త్ డే బాక్సాఫీస్ వద్ద కష్టాల్లో పడింది.

సంబంధిత సమాచారం :