హ్యాపీ బర్త్ డే టూ ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’

Published on May 20, 2023 12:26 am IST

టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన భారీ బ్లాక్ బస్టర్ మూవీ ఆర్ఆర్ఆర్ లో నటించి పెద్ద సక్సెస్ సొంతం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం కొరటాల శివ తో దేవర మూవీ చేస్తున్నారు ఎన్టీఆర్. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ పాన్ ఇండియన్ రేంజ్ లో రూపొందుతుండగా దీనిని యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి.

విషయం ఏమిటంటే నేడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ 39వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. కాగా పలువురు ప్రేక్షకులు, అభిమానులు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఆయనకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. ఇప్పటికే దేవర మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకోగా మూవీ కూడా గ్రాండ్ రేంజ్ లో తెరకెక్కుతోందని, తప్పకుండా 2024 ఏప్రిల్ 5న రిలీజ్ తరువాత అందరి అంచనాలు మించి సక్సెస్ అవుతుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇక యంగ్ టైగర్ కి మా 123 తెలుగు సైట్ తరపున ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ ఆయన కెరీర్ పరంగా మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాము.

సంబంధిత సమాచారం :