అన్నపూర్ణమ్మ, ఆమని, పాయల్ రాధాకృష్ణ, యాంకర్ ఝాన్సీ ప్రధాన తారాగణంగా వస్తున్న విభిన్నమైన మహిళా ప్రధాన ప్రయాణ కథా చిత్రం ‘హ్యాపీ జర్నీ’. నూతన దర్శకుడు అభిరామ్ నాయుడు తెరకెక్కిస్తున్న ఈ హోల్సమ్ ఎంటర్టైనర్ను బాలాజీ గుట్ట, కౌశిక్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఏడుగురు బలమైన మహిళా పాత్రలతో రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 18న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాలను పెంచింది.
ఈ చిత్ర యూనిట్ ఒక వెరైటీ ప్లానింగ్ తో ముందుకు వెళ్తోంది. అధికారిక విడుదలకు ముందే, సెప్టెంబర్ 15న హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్, వైజాగ్‌లోని ఏఏఏ సినిమాస్‌లో ప్రత్యేక ప్రీమియర్ షోలను ఏర్పాటు చేస్తున్నారు. కంటెంట్‌పై ఉన్న నమ్మకంతో మేకర్స్ ఈ బోల్డ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రత్యేక ప్రదర్శనల ద్వారా వచ్చే పాజిటివ్ టాక్, సినిమాకు బలమైన మౌత్ టాక్‌ను తెచ్చిపెడుతుందని, ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తారని చిత్ర బృందం గట్టిగా విశ్వసిస్తోంది.
