పవన్ ‘హరి హర వీరమల్లు’ కొత్త రిలీజ్ డేట్ ఇదే ?

Published on Oct 3, 2022 11:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘హరి హర వీరమల్లు’. ఐతే, ఈ సినిమాకి కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందని టాక్ నడుస్తోంది. 2023 మే 12న ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ కోసం విదేశీ నిపుణులు కూడా పని చేస్తుండటం విశేషం.

త్వరలో జరగబోయే ఓ యాక్షన్ షెడ్యూల్ కి సంబంధించి చిత్రబృందం ఓ ప్రత్యేకమైన సెట్ ను కూడా నిర్మించింది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన వర్క్ షాప్ జరుగుతుంది. ఇక ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ పాన్‌ ఇండియా సినిమా రాబోతుంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్‌ కథానాయికగా నటిస్తోంది.

సంబంధిత సమాచారం :