పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ మూవీ ‘హరి హర వీరమల్లు’. ఈ చిత్రం మే 9, 2025న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఐతే, ఈ చిత్రం విడుదల తేదీ మారే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఈ షూట్ లో పార్ట్ టూకి సంబంధించిన సన్నివేశాలను తీస్తున్నారు. మొదటి భాగానికి సంబంధించిన చాలా సన్నివేశాలు పూర్తయినప్పటికీ, పవన్ కళ్యాణ్ కి సంబంధించిన కీలకమైన సీన్స్ ను ఇంకా షూట్ చేయాల్సి ఉంది.
కాగా పవన్ త్వరలో సెట్స్‌లో అడుగు పెడతాడు అని, ఏప్రిల్ చివరిలోపు డబ్బింగ్‌తో పాటు తన సీన్స్ ను పూర్తి చేస్తాడని తెలుస్తోంది. ఈ లోపు పార్ట్ 2 సీన్స్ మేకర్స్ షూట్ చేస్తున్నారు. అన్నట్టు డైరెక్టర్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ తో పాటు బాబీ డియోల్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు మరియు నోరా ఫతేహి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అన్నట్టు క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాలోని పలు సన్నివేశాలకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే