బిగ్‌బాస్ 5: ఆర్జే కాజల్‌కు హరితేజ సపోర్ట్..!

Published on Oct 1, 2021 12:44 am IST


బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్‌బాస్‌’ సీజన్ 5 రసవత్తరంగా జరుగుతుంది. మొత్తం 19 మంది కంటెస్టెంట్లు హౌస్ లోపలికి వెళ్లగా మొదటి వారం సరయూ ఎలిమినేట్ కాగా, రెండో వారం ఉమాదేవి, మూడో వారం లహరి ఎలిమినేట్ అయ్యింది. ప్రస్తుతం హౌస్‌లో 16 మంది సభ్యులు ఉన్నారు. ఈ వారం ఎలిమినేషన్‌కు నటరాజ్, లోబో, రవి, ప్రియ, కాజల్, సిరి, సన్నీ, ఆనీలు నామినేషన్‌లో ఉన్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం హౌస్‌లో ఉన్న సభ్యులకు సెలబ్రెటీల నుంచి సపోర్ట్ బాగానే ఉంటుంది.

అయితే మానస్‌కు హీరో సందీప్‌ కిషన్‌ సపోర్ట్‌ చేస్తుండగా, సీనియర్‌ నటి ప్రియకు గత సీజన్‌ బిగ్‌బాస్‌ రన్నరప్‌ అఖిల్‌ సార్థక్‌, సింగర్ శ్రీరామచంద్రకు నోయల్, యాంకర్ రవికి టిక్‌టాక్ స్టార్ దుర్గారావు వంటి వారు మద్ధతు ఇస్తున్నారు. అయితే తాజాగా ఆర్జే కాజల్‌కు మాజీ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ హరితేజ మద్ధతు ఇస్తూ ఇన్‌స్టాలోకి వచ్చింది. హౌస్‌లో ఉన్న ఆర్జే కాజల్ కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇస్తుందని, ఈ వారం నామినేషన్‌లో ఉన్న ఆమెకు అభిమానులందరూ ఓట్లు వేసి సేవ్‌ చేయాలని కోరింది. అంతేకాదు కాజల్ టాప్‌ 5లో ఉంటుందని హరితేజ ధీమా వ్యక్తం చేసింది.

సంబంధిత సమాచారం :