“వీరమల్లు” సెట్స్ లో ఆసక్తికర వీడియో షేర్ చేసిన దర్శకుడు.!

“వీరమల్లు” సెట్స్ లో ఆసక్తికర వీడియో షేర్ చేసిన దర్శకుడు.!

Published on Dec 7, 2022 7:59 AM IST

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మన టాలీవుడ్ విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరలెక్కిస్తున్న మాసివ్ పాన్ ఇండియా చిత్రం “హరిహర వీరమల్లు” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం షూటింగ్ అయితే ఇప్పుడు హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ లో శరవేగంగా జరుగుతోంది. అలాగే నిన్ననే ఈ సినిమా నుంచి పవన్ లుక్ కూడా బయటకు రాగా అది పెద్ద ఎత్తున కూడా వైరల్ అయ్యింది.

మరి ఇదిలా ఉండగా ఈ ఉదయం అయితే దర్శకుడు క్రిష్ ఓ ఆసక్తికరమైన వీడియో షేర్ చేయదం జరిగింది. తాము షూటింగ్ చేస్తున్న సమయంలో ఆకాశంలో త్రిభుజాకారంలో ఏదో గాలిలో కనిపిస్తుందని దాన్ని చూపించారు మరి ఇదేదో వింతగానే ఉందని చెప్పాలి. దీనితో ఈ ఆసక్తికరమైన సస్పెన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ భారీ సినిమాకి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు అలాగే ఏ ఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు