మరింత లేట్ గా స్టార్ట్ కానున్న “వీరమల్లు”.?

Published on Oct 21, 2021 9:00 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న మొట్టమొదటి భారీ పాన్ ఇండియన్ చిత్రం “హరిహర వీరమల్లు”. విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్ల మూడి తెరకెక్కిస్తున్న ఈ భారీ సినిమా పై తారా స్థాయి అంచనాలు కూడా నెలకొన్నాయి. మరి ఈ భారీ సినిమా దాదాపు 60 శాతం మేర కంప్లీట్ అవ్వగా మిగతా షూట్ అంతా బ్యాలన్స్ ఉంది.

అయితే ఈ మిగతా షూట్ ని ఈ వచ్చే నవంబర్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారని టాక్ రాగా ఇప్పుడు అది షిఫ్ట్ అయ్యినట్టుగా బజ్ వినిపిస్తుంది. లేటెస్ట్ గా అయితే ఈ చిత్రం బ్యాలన్స్ షూట్ వచ్చే డిసెంబర్ నెల నుంచి స్టార్ట్ చెయ్యనున్నారట. ఇంకా ఇందులో ఎంతమేర నిజముందో కానీ దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఇక ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలాగే మెగా సూర్య ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More