ఫైనల్ గా “వీరమల్లు” షూట్ అప్పుడు నుంచి స్టార్ట్.!

Published on Nov 27, 2021 7:04 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు “భీమ్లా నాయక్” అనే మాస్ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే దీనితో పాటుగా పవన్ ఇంకో భారీ సినిమా దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తో కూడా చేస్తున్నాడు. అదే “హరిహర వీరమల్లు”. పాన్ ఇండియన్ లెవెల్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పుడు దాదాపు సగంకి పైగా షూట్ ని కంప్లీట్ చేసుకుంది.

అయితే ఈ చిత్రం షూటింగ్ మళ్లీ ఎప్పుడు రీస్టార్ట్ అవుతుంది అనేది తెలుస్తోంది. ఈ చిత్రం వచ్చే డిసెంబర్ చివరి వారం నుంచి స్టార్ట్ కానుందట. అలాగే ఈ స్టార్ట్ కూడా అదిరే యాక్షన్ బ్లాక్ తోనే షురూ కానున్నట్టు టాక్. ఇక ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలాగే మెగా సూర్య ప్రొడక్షన్ వారు ఈ చిత్రాన్ని నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :