అమ్మతోడు గత్తర్ లేపినవ్ పో…దసరా టీజర్ పై హరీష్ శంకర్ కామెంట్స్!

Published on Jan 31, 2023 8:30 pm IST

నేచురల్ స్టార్ నాని హీరోగా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం లో తెరకెక్కిన రా అండ్ విలేజ్ యాక్షన్ డ్రామా దసరా. ఈ చిత్రం మార్చ్ లో రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ ను భారతీయ ప్రధాన భాషల్లో చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. ఈ టీజర్ కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. టీజర్ ను తెలుగు లో రిలీజ్ చేసిన రాజమౌళి చేసిన వ్యాఖ్యలతో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

డైరెక్టర్ శ్రీకాంత్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ పై డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీకాంత్ ఓదెల స్వీట్ అండ్ జెన్యూన్ మెసేజ్ అని అన్నారు. ఒక లెజెండ్ పర్సన్ కాంప్లిమెంట్స్ తర్వాత అందరివీ కాస్త తగ్గుతాయి అని తెలుసు. కానీ మీ నిజాయితీ కి నేను ముగ్ధుదయ్యాను, అమ్మతోడు గత్తర్ లేపినవ్ పో అంటూ చెప్పుకొచ్చారు. హరీష్ శంకర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం :