డైరెక్టర్ గోపీచంద్ కి హరీష్ శంకర్ బెస్ట్ విషెస్!

డైరెక్టర్ గోపీచంద్ కి హరీష్ శంకర్ బెస్ట్ విషెస్!

Published on Jun 20, 2024 10:32 PM IST

టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మ‌లినేని చివరిసారిగా వీరసింహారెడ్డి చిత్రం ను డైరెక్ట్ చేశారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. నేడు ప్ర‌ముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేక‌ర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా నిర్మిస్తున్న యాక్ష‌న్ మూవీని అనౌన్స్ చేశారు. బాలీవుడ్ యాక్ష‌న్ హీరో స‌న్నీ డియోల్ ఇందులో లీడ్ రోల్ లో నటిస్తుండగా, గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. నేడు ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

ఈ చిత్రం పట్ల ఎంతో ఎగ్జైట్ అవుతున్నట్లు తెలిపారు గోపిచంద్. అయితే తాజాగా హరీష్ శంకర్ సోషల్ మీడియా వేదికగా బెస్ట్ విషెస్ తెలిపారు. నీ హిందీ డెబ్యూ మూవీ కి నేను కూడా చాలా ఎగ్జైట్ అవుతున్నా అని అన్నారు. అంతేకాక మైత్రి మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు