“ఉస్తాద్ భగత్ సింగ్” విషయంలో హరీష్ క్లారిటీ.!

Published on Mar 15, 2023 11:02 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు హరీష్ శంకర్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మొదటగా భవదీయుడు భగత్ సింగ్ గా స్టార్ట్ చేసిన సినిమాని ఇప్పుడు మేకర్స్ అయితే ఉస్తాద్ భగత్ సింగ్ గా మార్చారు. మరి సరికొత్తగా అనౌన్స్ చేసిన ఈ సాలిడ్ ప్రాజెక్ట్ పై అయితే ఆల్రెడీ పలు రూమర్స్ ఉన్న సంగతి తెలిసిందే.

సినిమా రీమేక్ విషయంలో పలు మార్పులు చేర్పులు విషయంలో అయితే ఇప్పుడు వైరల్ గా మారిన కొన్ని అంశాలపై హరీష్ అయితే లేటెస్ట్ గా స్పందించడం వైరల్ గా మారింది. ఈ వార్తల్లో అయితే ఎలాంటి నిజం లేదని హరీష్ ఖండించాడు. అయితే రీమేక్ సినిమానా లేక ఆ రీమేక్ లో మార్పులు తాను నిజం కాదు అని చెప్పారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. దీనితో అయితే ప్రస్తుతం పవన్ ఫ్యాన్స్ లో కొంచెం క్లారిటీ వచ్చిందని చెప్పుకోవాలి.

సంబంధిత సమాచారం :