నెవర్ బిఫోర్ గా అల్లు అర్జున్..హరీష్ శంకర్ క్రేజీ ట్వీట్.!

Published on Jul 28, 2022 3:00 pm IST


మన టాలీవుడ్ లో స్టైలింగ్ కి పెట్టింది పేరు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన ప్రతి సినిమాతో కూడా ఒక కొత్త స్టైల్ తో ట్రెండ్ సెట్ చేసే అల్లు అర్జున్ ఇప్పుడు తన భారీ సినిమా పుష్ప తో పాన్ ఇండియా స్థాయిలో ఐకాన్ స్టార్ గా మారాడు. అయితే ఈ ఈ సినిమా షూట్ లో ఉన్నా కూడా తనలోని స్టయిలింగ్ మాత్రం ఎప్పటికప్పుడు కనిపిస్తూనే ఉంది.

ఇక లేటెస్ట్ గా అయితే కొన్ని ఫోటోలు వైరల్ అవుతుండగా కొన్ని యాడ్ షూట్స్ లో బన్నీ ఇప్పుడు మంచి బిజీగా ఉన్నది. మరి ఈ బిజీలో ఒక యాడ్ తన దర్శకుడు హరీష్ శంకర్ తో కూడా చేస్తుండగా ఈ యాడ్ పై హరీష్ శంకర్ పెట్టిన క్రేజీ ట్వీట్ మంచి వైరల్ గా మారింది.

ఐకాన్ స్టార్ ని నెవర్ బిఫోర్ అవతార్ లో చూడడానికి అంతా సిద్ధంగా ఉండండి అంటూ చేసిన పోస్ట్ ఇప్పుడు మంచి వైరల్ గా మారిపోయింది. దీనితో అల్లు అర్జున్ నుంచి కొత్త లుక్ ఎలా ఉంటుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఆల్రెడీ వీరి కాంబోలో వచ్చిన “డీజే” కి హరీష్ శంకర్ సాలిడ్ లుక్స్ సెట్ చేసాడు. మరి ఇప్పుడు ఎలాంటి ట్రీట్ ఇస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం :