జన్మంతా గుర్తుండిపోయే జ్ఞాపకాన్ని ఇచ్చారు – డైరెక్టర్ హరీష్ శంకర్

Published on Feb 27, 2023 3:05 pm IST

సోషల్ మీడియాలో యాక్టిివ్ గా ఉండే టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తాజాగా సరికొత్త పోస్ట్ ను షేర్ చేశారు. సంగీత దిగ్గజం, మాస్ట్రో ఇళయరాజా తో ఉన్న ఫోటో అది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ కూడా ఈ ఫోటో లో ఉన్నారు. “ఎదురాయే గురువైన దైవం ఎదలాయే మంజీర నాదం” అంటూ ఈ ఫోటో కి క్యాప్షన్ ఇచ్చారు. అంతేకాక ఈ అవకాశం కల్పించిన రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కి థాంక్స్ తెలుపుతూ, వే వేల కృతజ్ఞతలు, జన్మంతా గుర్తుండిపోయే జ్ఞాపకాన్ని ఇచ్చారు అని పేర్కొన్నారు.

దేవి శ్రీ ప్రసాద్, హరీష్ శంకర్ కాంబో లో పలు సినిమాలు వచ్చాయి. హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ ను చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి కూడా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. వీరి కాంబో లో వస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం :