ఇద్దరు హీరోలతో మల్టీ స్టారర్ సినిమా చేయనున్న హరీష్ శంకర్ !


ఇటీవలే ‘దువ్వాడ జగన్నాథమ్’ తో మంచి విజయాన్ని అందుకుని టాప్ లీగ్ లోకి వెళ్లిన దర్శకుడు హరీష్ శంకర్ తన తర్వాతి సినిమాని కొంచెం ప్రత్యేకంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. తెలుగు పరిశ్రమలో మల్టీ స్టారర్ కు ఆదరణ పెరిగిన నైపథ్యంలో హరీష్ శంకర్ నెక్స్ట్ ప్రాజెక్టుకు ఇదే పద్దతిని ఫాలో అవుతారని తెలుస్తోంది.

ఈ సినిమాలో ఇద్దరు యువ హీరోలు నటిస్తారట. బలమైన భావోద్వేగాలతో కూడి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉండబోయే ఈ చిత్రానికి ‘దాగుడు మూతలు’ అనే టైటిల్ ను కూడా నిర్ణయించినట్టు ఫిల్మ్ నగర్ సమాచారం. అలాగే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత, డీజేను నిర్మించిన దిల్ రాజు నిర్మిస్తారట. అయితే ఇందులో నటించబోయే ఆ ఇద్దరు హీరోలు ఎవరు, ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుంది అనే వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.