సినిమాలు మానేస్తానంటూ ఓపెంగ్ ఛాలెంజ్ విసిరిన హరీష్ శంకర్ !
Published on Jul 6, 2017 12:10 pm IST


అల్లు అర్జున్ ‘దువ్వాడ జగన్నాథమ్’ చిత్రం విడుదలకు ముందు, విడుదల తర్వాత కూడా వార్తల్లో నిలుస్తోంది. మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ తో పాటు మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ చిత్రం ప్రేక్షకాదరణతో ఏపి, తెలంగాణాల్లో భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది. బన్నీ కెరీర్లో ఇవే అత్యుత్తమ కలెక్షన్లు కావడం విశేషం. కానీ కొందరు మాత్రం డీజే రికార్డులన్నీ అబద్దమని, హైప్ కోసం కావాలనే చేస్తున్నారని సోషమ్, వెబ్ మీడియాల్లో విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు.

దీంతో విషయాన్ని సీరియస్ గా తీసుకున్న చిత్ర యూనిట్ కొద్దిసేపటి క్రితమే నైజాం వ్యాప్తంగా డీజే యొక్క మొదటి 13 రోజుల షేర్ వివరాల్ని బహిర్గతం చేసింది. ఈ లెక్కల ప్రకారం మొదటి 13 రోజులకు కలిపి రూ. 20 కోట్ల పైనే వసూలు చేసింది. ఇది బన్నీకి నైజాంలో మొదటి రూ. 20 కోట్ల సినిమా కాగా హరీష్ శంకర్ కు రెండవది. దీంతో పాటే ఈ లెక్కల్ని ఎవరైనా ఫేక్ అని ప్రూవ్ చేస్తే సినిమాలు చేయడం మానేస్తానని ఓపెన్ ఛాలెంజ్ విసిరారు.

తమ నటీనటులు, సాంకేతిక నిపుణుల కష్టాన్ని కొందరు తమ అబద్దపు రాతలతో అవమానపరుస్తున్నారని అందుకే ఇలా ట్వీట్ చేయాల్సి వస్తోందని చివర చిన్న వివరణ కూడా ఇచ్చారు.

 
Like us on Facebook