“భవదీయుడు భగత్ సింగ్” పై హరీష్ శంకర్ పవర్ ఫుల్ ప్రామిస్.!

Published on Jun 10, 2022 11:15 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం పలు భారీ సినిమాలు ఇప్పుడు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే వాటిలో ఆల్రెడీ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తో చేస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా “హరిహర వీరమల్లు” షూటింగ్ లో ఉండగా దాని తర్వాత పవన్ హిట్ దర్శకుడు హరీష్ శంకర్ తో “భవదీయుడు భగత్ సింగ్” అనే సినిమా చేస్తున్నారు. అయితే గత కొన్నాళ్ల నుంచి ఈ సినిమాపై వస్తున్న రూమర్స్ ని గాను నిన్ననే చిత్ర యూనిట్ స్వయంగా పవన్ తోనే ఖండించారు.

మరి ఇదే సమయంలో దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఈ సినిమాపై మాట్లాడుతూ ఈ సినిమా ఎప్పుడు మొదలైనా ఎప్పుడు వచ్చినా కూడా మళ్లీ ఆ సినిమా కోసం పది కాలాల పాటు మాట్లాడుకునేలా ఉంటుంది అని, అందులో పాటలు గాని డైలాగ్స్ గాని మళ్లీ ట్రెండ్ సెట్టింగ్ గా ఉంటాయని చెప్పడం మంచి ఆసక్తి గా మారింది. మొత్తానికి అయితే హరీష్ శంకర్ పవర్ ఫుల్ ప్రామిస్ ఇచ్చాడని చెప్పాలి.

సంబంధిత సమాచారం :