‘రిపబ్లిక్’ సినిమాపై రివ్యూ చెప్పేసిన హరీష్ శంకర్..!

Published on Oct 1, 2021 1:59 am IST


మెగా హీరో సాయిధరమ్ తేజ్, ఐశ్వర్య రాజేష్‌లు హీరో హీరోయిన్‌లుగా దేవ కట్టా దర్శకత్వంలో తెరకెక్కిన ‘రిపబ్లిక్’ చిత్రం అక్టోబరు 1 అనగా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే తాజాగా మీడియా మిత్రులకు, సినీ ప్రముఖుల కోసం ప్రీమియర్ షోను వేయగా దర్శకుడు హరీశ్ శంకర్ ఈ సినిమాను వీక్షించాడు. ఆ తర్వాత ‘రిపబ్లిక్’ సినిమాపై ట్విట్టర్ వేదికగా స్పందించాడు.

ఇప్పుడే రిపబ్లిక్ సినిమాను చూశానని, సాయి తేజ్‌కి ఈ సినిమా కెరీర్‌లో బెస్ట్‌గా నిలవడం ఖాయమని అన్నారు. మంచి నిజాయితీ కథను తీసుకొచ్చిన దర్శకుడు దేవకట్ట గారికి అభినందనలు తెలియచేశాడు. జగపతి బాబు, రమ్యకృష్ణ, ఐశ్వర్య రాజేష్‌లు వారి వారి పాత్రల్లో అద్భుతంగా నటించారని ట్వీట్ చేశాడు.

సంబంధిత సమాచారం :