రవితేజ మాస్ స్వాగ్.. హరీష్ పోస్ట్ కి రవితేజ ఫన్నీ రిప్లై వైరల్

రవితేజ మాస్ స్వాగ్.. హరీష్ పోస్ట్ కి రవితేజ ఫన్నీ రిప్లై వైరల్

Published on Jun 23, 2024 1:00 PM IST

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం “మిస్టర్ బచ్చన్” కోసం తెలిసిందే. మరి ఈ సినిమా వీరి కాంబినేషన్ వస్తున్నా హ్యాట్రిక్ సినిమా ఇది కాగా దీనిపై సాలిడ్ బజ్ నెలకొంది. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేస్తున్నారు. మరి ఈ సినిమా షూటింగ్ సెట్స్ నుంచి అయితే మాస్ మహారాజ్ పిక్ ఒకటి షేర్ చేసి హరీష్ శంకర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు.

ప్రపంచకంలో అందరికీ వయసొస్తుంది ఒక్క అన్నయ్యకి తప్ప అంటూ రవితేజ మాస్ స్వాగ్ తో కూర్చుకున్న పిక్ పెట్టి అప్డేట్ అందించారు. కాశ్మీర్ వాలీలో షూట్ పూర్తి చేసుకుని హైదరాబాద్ కి వస్తున్నామని హరీష్ పోస్ట్ పెట్టగా దీనికి రవితేజ ఇచ్చిన ఫన్ రిప్లై ఫ్యాన్స్ లో మరింత వైరల్ అయ్యింది. తన మార్క్ టైమింగ్ తో “దిష్టి పెట్టకు రోయ్… నీ దిష్టే తగిలేలా ఉంది” నాటు రిప్లై ఇచ్చారు. దీనితో వీరి పోస్ట్ లు మంచి వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు