వైరల్ : పవన్ తో జర్నీపై హరీష్ శంకర్ స్పెషల్ పోస్ట్.!

వైరల్ : పవన్ తో జర్నీపై హరీష్ శంకర్ స్పెషల్ పోస్ట్.!

Published on Dec 11, 2022 4:00 PM IST

టాలీవుడ్ లో ఉన్నటువంటి కొన్ని ఎవర్ గ్రీన్ సెన్సేషనల్ కాంబినేషన్ లలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు దర్శకుడు హరీష్ శంకర్ ల కాంబో కోసం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పవర్ స్టార్ కెరీర్ లో ఓ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన “గబ్బర్ సింగ్” సరిగ్గా పదేళ్ల కితం 2012 లో విడుదల అయ్యి ఇద్దతి కెరీర్ లో కూడా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక మళ్ళీ ఈ పదేళ్ల తర్వాత ఈ కాంబో నుంచి ఇప్పుడు “ఉస్తాద్ భగత్ సింగ్” అనే అదిరే సినిమాని అనౌన్స్ చేయడంతో అయితే హరీష్ శంకర్ లేటెస్ట్ గా ఓ స్పెషల్ అండ్ మెమొరబుల్ పోస్ట్ ని పెట్టారు.

మే 11, 2012 నుంచి ఇప్పుడు డిసెంబర్ 11, 2022 ఇది కేవలం కొన్నేళ్లు మాత్రమే కాదు నాకొక దశాబ్దం ఎంతగానో కోరుకుంటున్న రోజు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారితో సెట్స్ లో ఉండడం, ఉస్తాద్ భగత్ సింగ్ ఈరోజు నుంచి మొదలైంది” మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ హరీష్ శంకర్ ఈరోజు లాంచ్ కార్యక్రమం నుంచి ఫొటోలతో ఈ హ్యాపీ అండ్ ఎమోషనల్ మూమెంట్ ని పంచుకున్నారు. దీనితో ఇపుడు హరీష్ పోస్ట్ ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు