వైరల్ : “వీరమల్లు” డైరెక్టర్ కి హరీష్ శంకర్ స్పెషల్ విషెష్.!

వైరల్ : “వీరమల్లు” డైరెక్టర్ కి హరీష్ శంకర్ స్పెషల్ విషెష్.!

Published on Nov 10, 2022 2:00 PM IST

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియా చిత్రం “హరిహర వీరమల్లు” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం ఇప్పుడు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా లేటెస్ట్ గా అయితే ఈ సినిమా ట్యాగ్ ట్రెండింగ్ గా మారింది.

అయితే ఈరోజు చిత్ర దర్శకుడు క్రిష్ బర్త్ డే కావున పవన్ ఫ్యాన్ డైరెక్టర్ హరీష్ శంకర్ క్రిష్ కి స్పెషల్ బర్త్ డే విషెష్ ని అయితే తెలియజేసారు. మోస్ట్ సెన్సిబుల్ రైటర్ మరియు యూనిక్ డైరెక్టర్ వీటిని మించి నాకు ఓ నిజమైన స్నేహితుడు అయినటువంటి క్రిష్ కి నా బర్త్ డే విషెష్ తెలియజేస్తున్నానని తన సినిమా “హరిహర వీరమల్లు” కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని పవన్ తో తాను క్రిష్ కలిసి భీమ్లా నాయక్ సెట్స్ లో ఉన్న ఫోటో పెట్టి తెలిపారు. దీనితో ఈ పోస్ట్ ఇప్పుడు మంచి వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు