థాంక్యూ తేజ గారు – హరీష్ శంకర్

Published on May 30, 2023 6:01 pm IST

టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి మళ్ళీ పూర్వ వైభవం తెచ్చిన సినిమా గబ్బర్ సింగ్. పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదే కాంబినేషన్ ను రిపీట్ చేస్తూ, డైరెక్టర్ హరీష్ శంకర్ తో ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం నుండి రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్ కి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. ఇదే టీజర్ పై డైరెక్టర్ తేజ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.

పవన్ కళ్యాణ్ గారి తో అయితే ఎలాంటి స్టోరీ చేస్తారు అని అడగగా, రీసెంట్ గా రిలీజైన వీడియో చాలా బాగుంది అని, పవన్ కళ్యాణ్ తో సినిమా అలా ఉండాలి అని, ట్రైలర్ చూడగానే హిట్ అనిపించింది అంటూ ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ గురించి చెప్పుకొచ్చారు. తేజ చేసిన వ్యాఖ్యల పట్ల డైరెక్టర్ హరీష్ శంకర్ సంతోషం వ్యక్తం చేస్తూ, థాంక్యూ తేజ గారు అని అన్నారు.

సంబంధిత సమాచారం :