అర్థం చేసుకోమంటున్న హరీష్ శంకర్ !


అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న దువ్వాడ జగన్నాధమ్ చిత్రం వివాదంలో చిక్కుకుంది. ఇటీవల చిత్ర యూనిట్ గుడిలో బడిలో ఒడిలో అనే సాంగ్ ని విడుదల చేశారు. ఆ పాటలోని లిరిక్స్ తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ బ్రాహ్మణుల సంఘాలు మండిపడుతున్నాయి. వెంటనే పాటలో పదాలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశం వివాదంగా మారింది.

వివాదం ఎక్కువవుతుండడంతో బిజీగా ఉన్నప్పటికీ దర్శకుడు హరీష్ శంకర్ దీనిపై స్పందించక తప్పలేదు.ప్రముఖ మీడియా సంస్థ ద్వారా హరీష్ ఈ వివాదంపై స్పందించాడు. తాను బ్రాహ్మణులను కించపరచాడనికి ఈ చిత్రాన్ని తీయడం లేదని దయచేసి అర్థం చేసుకోవాలని హరీష్ కోరాడు. పాటలోని లిరిక్స్ ని అపార్థం చేసుకోవద్దని హరీష్ కోరాడు. షూటింగ్ పూర్తయిన తరువాత తాను అన్ని అంశాల పైనా వివరణ ఇస్తానని చెప్పుకొచ్చాడు. కాగా డీజే చిత్రం జూన్ 23 న విడుదలకు సిద్ధం అవుతోంది.