దిల్ రాజు నిర్మాణంలో హరీష్ శంకర్ నిర్మిస్తోన్న సినిమా ‘దాగుడుమూతలు’. శర్వానంద్, నితిన్ ఈ సినిమాలో హీరోలుగా నటించబోతున్నారు. తాజా సమాచారం మేరకు ఈ మూవీ మే నుండి ప్రారంభం కానుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కబోతోంది.
ఈ సినిమా మొదలు అవ్వడానికి ఇంకా మూడు నెలల సమయం ఉంది. ఈలోపు సినిమా స్క్రిప్ట్, ఆర్టిస్ట్ సెలెక్షన్స్ అన్ని పూర్తి చేసుకొని పక్కాగా సెట్స్ మీదకు వెళ్లాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ సినిమాతో పాటు దిల్ రాజు పలు చిత్రాలు ప్లాన్ చేస్తున్నారు. అందులో అనిల్ రావిపూడి చేయబోయే మల్టీ స్టారర్, నితిన్ ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాలు ముఖ్యమైనవి. ఇకపోతే హరీష్ శంకర్ సినిమాలో నటించబోయే హీరోయిన్స్ వివరాలు కూడా త్వరలో తెలియనుంది.
