సుధీర్ బాబు కెరీర్ లోనే ఆల్ టైమ్ హ‌య్యెస్ట్ ఓపెనింగ్స్

సుధీర్ బాబు కెరీర్ లోనే ఆల్ టైమ్ హ‌య్యెస్ట్ ఓపెనింగ్స్

Published on Jun 15, 2024 3:30 PM IST

న‌వ ధ‌ళ‌ప‌తి సుధీర్ బాబు న‌టించిన లేటెస్ట్ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ మూవీ ‘హ‌రోం హ‌ర’ మంచి అంచ‌నాల మ‌ధ్య జూన్ 14న థియేట‌ర్ల‌లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ ల‌భిస్తుండటంతో చిత్ర యూనిట్ సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. సుధీర్ బాబు పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో నెక్ట్స్ లెవెల్ లో ఉందంటూ అభిమానులు కితాబిస్తున్నారు.

ఇక ఈ సినిమాలోని మాస్ అంశాలు ప్రేక్ష‌కుల‌ను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. కాగా, ఈ సినిమాకు తొలి రోజు బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్లు వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది. సుధీర్ బాబు కెరీర్ లోనే హ‌య్యెస్ట్ ఓపెనింగ్స్ ఈ మూవీకి వ‌చ్చిన‌ట్లుగా మేక‌ర్స్ తెలిపారు. ఈ మేర‌కు వారు ఓ పోస్ట‌ర్ తో ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.

‘హ‌రోం హ‌ర’ చిత్రంలో మాళ‌విక శ‌ర్మ హీరోయిన్ గా న‌టించ‌గా సునీల్, ర‌వి కాలె, కేశ‌వ్ దీప‌క్, జ‌య‌ప్ర‌కాష్ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. ఈ సినిమాకు చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందించ‌గా, శ్రీ సుబ్ర‌హ్మ‌ణ్యేశ్వ‌ర సినిమాస్ బ్యాన‌ర్ పై సుమంత్ జి నాయుడు ఈ ఇత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు