రిలీజ్ కి ముందు రోజు “హరోం హర” పెయిడ్ ప్రీమియర్…డీటైల్స్ ఇవే!

రిలీజ్ కి ముందు రోజు “హరోం హర” పెయిడ్ ప్రీమియర్…డీటైల్స్ ఇవే!

Published on Jun 12, 2024 10:32 PM IST

టాలీవుడ్ హీరో సుధీర్ బాబు ప్రధాన పాత్రలో, దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా హరోం హర ఈ శుక్రవారం థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. రిలీజైన ట్రైలర్ సినిమా పై అంచనాలను పెంచేసింది. ఈ చిత్రం రిలీజ్ కి ఒక రోజు ముందుగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హైదరాబాద్ లోని AMB సినిమాస్ లో గురువారం రాత్రి 10:30 గంటలకు ఈ పెయిడ్ ప్రీమియర్ షో ప్రదర్శింపబడనుంది.

ఇందుకు సంబంధించిన బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ నిర్మించిన ఈ సినిమాలో మాళవిక శర్మ కథానాయికగా నటించడం జరిగింది. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ చిత్రంలో సునీల్, జయ ప్రకాష్, అక్షర, అర్జున్ గౌడ, లక్కీ లక్ష్మణ్ మరియు రవి కాలే తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు