కొరటాల శివ రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నాడని… ఇప్పటికే ఈ సినిమా తాలూకు లైన్ కూడా ఓకే అయిందనే వార్త, ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే చరణ్ తో కొరటాల సినిమా ఉంటుందని.. అది కూడా చరణ్ స్వంత ప్రొడక్షన్ హౌస్ లోనే ఉంటుందని.. కాకపోతే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి మరో రెండు మూడు సంవత్సరాలు పట్టొచ్చు అని తెలుస్తోంది.
ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా స్క్రిప్టు ఫైనల్ వెర్షన్ జరుగుతోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరి ఎండింగ్ లో మొదలు కానుందని.. రామోజీ ఫిల్మ్ సిటీలో వరుసగా ఇరవై రోజులు పాటు సినిమాలోని కొన్ని కీలక సన్నివేవాలను షూట్ చేయనున్నారు.
కాగా ఈ సినిమాలో మెగాస్టార్ సరసన త్రిషను హీరోయిన్ గా తీసుకోనున్నారని సమాచారం. కొరటాల శివ, మెగాస్టార్ కోసం ఓ మంచి సోషల్ మెసేజ్ తో కూడుకున్న స్క్రిప్ట్ ను తయారు చేసారట. ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలను త్వరలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.
