‘శర్వానంద్’ కొత్త సినిమా టైటిల్ ఫిక్స్ ?

Sharwanand

హీరో శర్వానంద్ – శ్రీను వైట్ల కాంబినేషన్ లో రాబోతున్న సినిమా టైటిల్ పై ఇప్పటికే కొన్ని రూమర్స్ వైరల్ అయ్యాయి. వాటిలో ‘జార్జ్ క్రిష్’ కూడా ఒకటి. ఐతే, తాజాగా వినిపిస్తున్న అప్ డేట్ ప్రకారం ఈ సినిమాకి జార్జ్ క్రిష్ అనే టైటిల్ నే ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. కాగా టైటిల్ ను కథకు తగ్గట్టే పెట్టారట. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

ఇక ఈ సినిమాలో రుక్మిణీ వ‌సంత్ హీరోయిన్‌ గా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. అన్నట్టు శర్వానంద్ ఈ సినిమా కోసం తన లుక్ ను మళ్లీ కొత్తగా ట్రై చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఐతే, గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ ‘విశ్వం’ ఏవరేజ్ గా నిలిచింది. దీంతో, ఎలాగైనా మళ్ళీ టాలీవుడ్ లో తన తర్వాత సినిమాతో బిజీ అయ్యేందుకు శ్రీనువైట్ల తెగ కష్ట పడుతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుంది.

Exit mobile version