సమంత గట్స్ కి హ్యాట్సాఫ్ – ‘యశోద’ డైరెక్టర్స్

Published on Jul 13, 2022 11:30 pm IST

టాలీవుడ్ స్టార్ నటి సమంత ప్రస్తుతం గుణశేఖర్ తీస్తున్న శాకుంతలం మూవీతో పాటు యువ డైరెక్టర్స్ హరీష్, హరి తెరకెక్కిస్తున్న యశోద మూవీ, అలానే వీటితో పాటు విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ తీస్తున్న ఖుషి మూవీ కూడా చేస్తున్నారు. ఈ మూడు మూవీస్ పై సమంత ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే సమంత చేస్తున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ పాన్ ఇండియన్ మూవీ యశోద నుండి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ అందరినీ ఎంతో ఆకట్టుకుంది. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకోవడంతో మూవీ గురించి డైరెక్టర్స్ హరీష్, హరి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు మీడియాతో పంచుకున్నారు.

తాము ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ చేయడానికి ముందే సమంతని కలిసి యశోద స్టోరీ వినిపించడం, ఆమె ఓకె చేయడం జరిగిందన్నారు. సెట్స్ లో అందరితో ఎంతో సరదాగా వ్యవహరిస్తూ కలివిడిగా ఉండే సమంత ఈ మూవీలోని తన క్యారెక్టర్ కోసం ఎంతో హార్డ్ వర్క్ చేసారని, ముఖ్యంగా కొన్ని సీన్స్ కోసం ఆమె కొన్నాళ్ల పాటు సెట్స్ లోనే గడపడం మాత్రమే కాదు, పలు ఫైట్స్ లోని రిస్కీ షాట్స్ ని ఎంతో డేరింగ్ గా చేసారని, నిజంగా ఆమె గట్స్ కి హ్యాట్సాఫ్ అన్నారు ఈ దర్శకులిద్దరు. టీమ్ అంతా ఎంతో కష్టపడి చేసిన యశోదా మూవీ ఆగస్టు 12న రిలీజ్ తరువాత అందరినీ తప్పకుండా ఆకట్టుకుంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేసారు.

సంబంధిత సమాచారం :