
రవిబాబు ‘నువ్విలా’ సినిమాతో మనకు పరిచయమైన హవీష్ ఆ తరువాత ఓంకార్ ‘జీనియస్’లో వేలు పెట్టి చెయ్యికాల్చుకున్నాడు. కొంతకాలం విరామంతరువాత ఈ నెల 27న రామ్ లీలా అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ ద్వారా మరోసారి మనల్ని పలకరించనున్నాడు.
ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. అమెరికాలో పెరిగిన తెలుగు యువకుడిగా హవీష్ నటన అలరిస్తుందని సమాచారం. ఈ సినిమాలో నందితరెడ్డి హీరోయిన్. గోపాల్ రెడ్డి కెమెరా భాద్యతలు నిర్వహించారు. కిరణ్ దర్శకుడిగా పరిచయంకానున్నాడు. దాసరి కిరణ్ కుమార్ నిర్మాత.