టికెట్ల ధరలు పెంచుకోమంటూ పర్మిషన్ ఇచ్చిన హైకోర్టు !

రాబోయే సంక్రాంతి సీజన్లో టికెట్ల ధరలను ప్రస్తుతం ఉన్న మొత్తానికన్నా ఎక్కువ చేసుకునేందుకు అనుమతివ్వాలని ఏపి, తెలంగాణలోని కొన్ని థియేటర్లు వేసిన పిటిషన్ ను హైకోర్టు పరిశీలించి ధరలను పెంచుకోవచ్చంటూ అనుమతిచ్చింది. సీజన్లో వచ్చే సినిమాల ప్రదర్శనకు ఎక్కువ మొత్తంలో నిధులు ఖర్చు చేయాల్సి వస్తోందని, అందుకే ధరల పెంపు కోరుతున్నామని థియేటర్ యాజమాన్యాలు వ్యాజ్యం దాఖలు చేశాయి.

దీని విచారించిన హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులనే మళ్ళీ జారీ చేశాయి. క్రితంసారి సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులనే ఈసారి సంక్రాంతికి కూడా వర్తింపజేశారు. అంతేగాక పెంచిన టికెట్ల ధరలను అధికారులకు తెలపాలని, పెంచిన ధరలకు అనుగుణంగా పన్నులు చెల్లించాలని యాజమాన్యాలకు సూచించాయి .