యంగ్ టైగర్ నెక్స్ట్ కి అతడే ఫిక్స్.!

Published on Aug 28, 2021 8:00 am IST


ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన భారీ చిత్రం మరియు బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” కంప్లీట్ చేసుకున్న సంగతి తెలిసిందే. మొన్ననే కంప్లీట్ చేసుకొని తన మరో నెక్స్ట్ బిగ్ ప్రాజెక్ట్ కి సన్నద్ధం అవుతున్నాడు. అయితే ఈ చిత్రాన్ని తన బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే.

దీనిని కూడా పాన్ ఇండియన్ స్కేల్ లోనే భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తుండగా గత కొన్నాళ్ల నుంచి ఈ చిత్రానికి వర్క్ చేసే మ్యూజిక్ డైరెక్టర్ పై ఓ బజ్ అలా వినిపిస్తూ వస్తుంది. మరి దాని ప్రకారం ఈ చిత్రానికి ఫైనల్ గా మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ ఫిక్స్ అయ్యినట్టుగా తెలుస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రానుంది అని సినీ వర్గాల్లో సమాచారం. ఈ చిత్రంపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ చిత్రం ఎప్పుడు నుంచి సెట్స్ మీదకు వెళ్ళనుందో చూడాలి.

సంబంధిత సమాచారం :