టాక్..”ఇండియన్ 2″ లో అతడే మెయిన్ విలన్.?

Published on Jun 6, 2023 10:03 am IST

ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో భారీ చిత్రం “ఇండియన్ 2” చేస్తున్న సంగతి తెలిసిందే. మరి తమ కాంబినేషన్ లో వచ్చిన బిగ్గెస్ట్ హిట్ ఇండియన్ కి సీక్వెల్ గా అంతకు మించిన భారీ హంగులతో ఈ సినిమా తెరకెక్కుతూ ఉండగా ఈ సినిమాపై అయితే లేటెస్ట్ గా ఇంట్రెస్టింగ్ బజ్ ఇపుడు వినిపిస్తుంది.

ఈ చిత్రంలో కమల్ ఎలాగో పవర్ ఫుల్ రోల్ చేస్తుండగా దానిని ఢీ కొట్టే మెయిన్ విలన్ పాత్రలో అయితే వెర్సటైల్ నటుడు ఎస్ జె సూర్య నటిస్తున్నట్టుగా ఇపుడు కోలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈ సినిమాలో తానే మెయిన్ విలన్ గా ఉంటాడని తనపై సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ని శంకర్ ఇండియన్ 2 లో డిజైన్ చేసినట్టుగా ఇపుడు తెలుస్తుంది. అంతే కాకుండా తాను తన షూట్ ని కూడా ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నారని కూడా తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :