క్రేజీ న్యూస్ : ప్రభాస్ – మారుతీ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ అతనేనట ?

Published on May 24, 2023 2:24 am IST


పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మైథలాజికల్ డ్రామా మూవీ ఆదిపురుష్ జూన్ 16న గ్రాండ్ లెవెల్లో ఆడియన్స్ ముందుకి రానుంది. కృతి సనన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని ఓం రౌత్ తెరకెక్కించారు. ఇక దీనితో పాటు ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో మారుతీ దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మిస్తున్న పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ కూడా ఒకటి.

మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రభాస్ మంచి స్టైలిష్ లుక్ లో అలరించే రోల్ లో కనిపించనున్న ఈ మూవీకి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ బజ్. మూవీ కోసం ఇప్పటికే థమన్ సూపర్ ట్యూన్స్ ని సిద్ధం చేస్తున్నారట. ఇక ఈ మూవీకి సంబందించిన పూర్తి వివరాలు అన్ని కూడా మేకర్స్ నుండి అఫీషియల్ గా అనౌన్స్ కావాల్సి ఉంది. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈ మూవీలో ఒక కీలక రోల్ లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :