ఆకట్టుకుంటున్న హెడ్స్ అండ్ టేల్స్ ట్రైలర్ రిలీజ్..!

Published on Oct 16, 2021 8:16 pm IST


శ్రీవిద్య మహర్షి, దివ్య శ్రీపాద, సునీల్, చాందిని రావు ప్రధాన పాత్రల్లో నటించిన జీ 5 ఒరిజినల్ మూవీ “హెడ్స్ అండ్ టేల్స్”. ఈ సినిమాకు కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ కథ అందించగా, ఆ సినిమాలో నటించిన సాయికృష్ణ ఈ సినిమాకు ఎన్రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ముగ్గురు మహిళల జీవితాల చుట్టూ తిరిగే థ్రిల్లింగ్ కథను చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. కాగా అక్టోబర్ 22 నుచి జీ 5 ఓటీటీ వేదికలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

More