హార్ట్ బ్రేకింగ్ న్యూస్..బాలీవుడ్ ఫేమస్ నటుడు సిద్దార్థ్ మృతి!

Published on Sep 2, 2021 12:05 pm IST


బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మరో ఊహించని తీరని లోటు జరిగింది.. ఇటీవల కాలంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో మారుమోగిన పేరు “సిద్ధార్థ్ శుక్ల”. అక్కడ బిగ్ బాస్ తో ఒక్కసారిగా మంచి ఫేమ్ లోకి వచ్చి ముఖ్యంగా యూత్ లో ఎంతో క్రేజ్ ని ఆనతి కాలంలో తెచ్చుకొని వైరల్ అయ్యాడు. తన పై ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా యిట్టే వైరల్ అయ్యిపోయేది.

మరి అలాంటి వ్యక్తి ఇప్పుడు ఊహించని విధంగా మరణించారు అన్నది ప్రతీ ఒక్కరినీ ఎంతగానో కలచివేస్తుంది. అసలు ఊహించని ఈ వార్త బాలీవుడ్ ఆడియెన్స్ హృదయాలను ముక్కలు చేసేసింది. అయితే తన మరణానికి కారణం సడెన్ హార్ట్ ఎటాక్ రావడమే అని తెలుస్తుంది. దీనిని ముంబై కూపర్ హాస్పిటల్ వారు కూడా కన్ఫర్మ్ చేసారు.

దీనితో ఈ హృదయ విదారక వార్త విన్న బాలీవుడ్ వర్గాలు చాలా బాధపడుతున్నాయి. ఇప్పుడే తన కెరీర్ లో మంచి గ్రాఫ్ వచ్చింది అనగా ఇలా జరగడం నిజంగా చాలా విచారకరం. దీనితో పలువురు బాలీవుడ్ ప్రముఖులు అభిమానులు తన అకాల మరణం పట్ల నివాళులు అర్పిస్తున్నారు. మరి సిద్దార్థ్ పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని మా 123తెలుగు యూనిట్ కూడా ప్రగాఢ సానుభూతి వ్యక్తపరుస్తుంది, ఓం శాంతి..

సంబంధిత సమాచారం :