‘హలో గురు’.. ఆడియో వేడుక తేదీ ఫిక్స్ అయ్యిందా ?

Hello Guru Prema Kosame

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న తాజా చిత్రం ‘హలో గురు ప్రేమకోసమే’ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఇటీవల విడుదలైన ఈచిత్ర టీజర్ చిత్రం ఫై అంచనాలను పెంచేసింది. ఇక ఈచిత్రం యొక్క ఆడియో విడుదల వేడుకను అక్టోబర్ 6న హైదరాబాద్లో గ్రాండ్ గా జరుపనున్నారని సమాచారం. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ద్రువీకరించాల్సి వుంది.

‘నేను లోకల్’ దర్శకుడు త్రినాధరావు నక్కిన తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తుంది. ప్రేమించిన అమ్మాయి కోసం హీరో ఏం చేశాడు అనే కథతో తెరకెక్కుతున్న ఈచిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈచిత్రం దసరా కానుకగా అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రానున్న ఈచిత్రం ఫై రామ్, అనుపమా భారీ ఆశలే పెట్టుకున్నారు.

Exit mobile version