మిలియన్ డాలర్ క్లబ్ లో చేరిన ‘హలో’ !

అఖిల్ అక్కినేని రెండవ చిత్రం ‘హలో’ ఓవర్సీస్లో మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. విడుదలైన మొదటి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఆ తర్వాత పెద్ద సినిమాలేవీ విడుదలకాకపోవడంతో
బాక్సాఫీస్ వద్ద ఎలాంటి పోటీ లేకుండా మిలియన్ డాలర్ మార్కును చేరుకుంది. ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు నిన్న శనివారం 9,563 డాలర్లను రాబట్టిన ఈ చిత్రం మొత్తంగా 1,000,033 డాలర్లను ఖాతాలో వేసుకుంది.

అఖిల్ రెండవ సినిమాతోనే ఈ ఫీట్ ను సాదించడం విశేషం. విక్రమ్ కుమార్ దర్శకత్వం, నాగార్జున పర్యవేక్షణ కలిసి సినిమాను ప్రేక్షకులకు నచ్చేలా తయారుచేశాయి. అంతేగాక ఈ చిత్రంతో అఖిల్ పరిపూర్ణ నటుడిగా ప్రేక్షకుల్లకు దగ్గరయ్యారు. నూతన నటి కళ్యాణి ప్రియదర్శన్ ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై మంచి మార్కులు కొట్టేసింది.