‘హలో’ కృష్ణా జిల్లా వసూళ్లు !

అక్కినేని అఖిల్ రీ-లాంచ్ చిత్రం ‘హలో’ గత శుక్రవారం విడుదలై మొదటి షో నుండే మంచి మౌత్ టాక్ ను తెచ్చుకుని అన్ని చోట్ల మెరుగైన వసూళ్లతో నడుస్తోంది. ముందు నుండి సినిమాకు మంచి పాజిటివ్ బజ్ ఉండటంతో తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ లలో ఓపెనింగ్స్ మంచి స్థాయిలో దక్కాయి.

ఇక కృష్ణా జిల్లాలో నిన్న రెండవ రోజు శనివారం రూ. 12.53 లక్షల షేర్ ను రాబట్టిన ఈ సినిమా రెండు రోజులకు కలిపి మొత్తంగా రూ. 34.92 లక్షలు వసూలు చేసింది. ఇక ఈరోజు ఆదివారం, రేపు క్రిస్టమస్ సెలవులు కావడంతో ఈ కలెక్షన్స్ ఇలాగే నిలకడగా కొనసాగే అవకాశాముంది. విక్రమ్ కుమార్ డైరెక్ చేసిన ఈ చిత్రాన్ని నాగార్జున అక్కినేని స్వయంగా నిర్మించగా కళ్యాణి ప్రియదర్శన్ ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది.