నాకు ‘మా’ సపోర్ట్ కావాలి – నటి హేమ

నాకు ‘మా’ సపోర్ట్ కావాలి – నటి హేమ

Published on Jul 8, 2024 3:05 PM IST


నటి హేమ రెండు నెలల క్రితం బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో పట్టుబడినట్లు వార్తలు రావడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆమె డ్రగ్స్ సేవించిందని ఆరోపణలు కూడా వచ్చాయి. ఆ తర్వాత విచారణకు వచ్చిన ఆమెను బెంగళూరు పోలీసులు అరెస్ట్ కూడా చేసినట్లు వార్తలు వచ్చాయి. పైగా ఈ మధ్యనే ఆమె బెయిల్ పై జైలు నుంచి బయటకు వచ్చిందని టాక్. ఈ నేపథ్యంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) హేమ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసింది.

ఈ క్రమంలో తాజాగా హేమ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ఓ లేఖ రాసి.. స్వయంగా మా అధ్యక్షుడు మంచు విష్ణును కలిసి ఆ లెటర్ ను అందజేసింది. ఇంతకీ, ఆ లెటర్ లో ఏముంది అంటే.. ‘నేను సుమారు దశాబ్ద కాలంగా మా అసోసియేషన్ లో సభ్యురాలిగా ఉన్నాను. అలాంటిది తనకు ఎటువంటి షోకాజ్ నోటీసులు జారీ చేయకుండా, కనీసం వివరణ అడగకుండా మా సభ్యత్వం నుంచి తొలగించడం అన్యాయం. బెంగళూరు రేవ్ పార్టీ ఉదంతంలో నాపై దుష్ప్రచారం జరిగింది. ఈ విషయంలో మా కూడా ఏకపక్షంగా వ్యవహరించింది. మా బైలాస్ ప్రకారం నాకు ముందుగా షోకాజ్ నోటీసు జారీ చేయాలి. కానీ అటువంటిదేమీ జరగలేదు. షోకాజ్ నోటీసుకు ఇచ్చిన వివరణ సరైనది కానప్పుడు ఏదైనా యాక్షన్ తీసుకోవాలి. కానీ ఎలాంటి షోకాజ్ నోటీసు ఇవ్వకుండా మా నుంచి నన్ను తీసెయ్యడం చాలా పెద్ద తప్పు. ఇటీవలె నేను డ్రగ్స్ టెస్ట్ చేయించుకున్నాను. అందులో నాకు నెగిటివ్ వచ్చింది. త్వరలోనే‌ పోలీసులు జరిపిన పరీక్షల వివరాలు బయటకు వస్తాయి. అందుకని మళ్లీ ‘మా’లో నా సభ్యత్వాన్ని కొనసాగించాలి. ఎందుకంటే డ్రగ్స్ కేసు విషయంలో నాకు ‘మా’ సపోర్ట్ కావాలి’ అని ఆమె తన లెటర్ లో రాసుకొచ్చింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు