వారి పై పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి హేమ!

Published on Oct 7, 2021 10:20 am IST

తెలుగు సినీ పరిశ్రమలో మా ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఒకరు పై మరొకరు విమర్శలు చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా, ఇప్పుడు నటి హేమ సీనియర్ నటుడు నరేష్ పై మరియు కరాటే కళ్యాణి పై మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇటీవల జరిగిన కొన్ని యూ ట్యూబ్ ఇంటర్వ్యూ లలో తనను దూషించారు అని హేమ ఆరోపించడం జరిగింది.

నరేష్ మరియు కరాటే కళ్యాణి ఇద్దరూ కూడా తనను బెదిరించారు అని, బ్లాక్ మెయిల్ చేశారు అంటూ ఫిర్యాదు లో పేర్కొన్నారు. అంతేకాక యూ ట్యూబ్ నుండి అవమాన కరమైన విడియో లను తొలగించాల్సింది గా పోలీసులను అభ్యర్డించడం జరిగింది. ఇప్పటికే ప్రకాష్ రాజ్ మరియు మంచు విష్ణు ప్యానెల్ ల మధ్య మాటల ఘర్షణలు జరుగుతుండగా, ప్రస్తుతం హేమ చేసిన చర్య పై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుండి నటి హేమ వైస్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :