‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా చేయనన్నాను : హేమమాలిని

hema-malini
నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా చేస్తున్న తన 100వ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. ప్రస్తుత మధ్యప్రదేశ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలోని చెప్పుకోదగ్గ విశేషాల్లో హేమాలిని పాత్ర ఒకటి. దాదాపు 40 సంవత్సరాల తరువాత ఆమె తెలుగు సినిమాలో నటిస్తోంది. ఈ విషయంపైనే హేమమాలిని మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నటించడం చాలా ఆనందనగా ఉంది. నాకు తెలుగు రాదు కాబట్టి మొదట ఈ సినిమా చేయనన్నాను. కానీ శాతకర్ణి తల్లి రాణి గౌతమి పాత్ర గొప్పగా ఉండటంతో ఒప్పుకున్నాను’ అన్నారు .

అలాగే ‘బాలకృష్ణతో పనిచేయడం చాలా సులభంగా ఉంది. ఆయన తన మొబైల్ లో ఎన్టీఆర్ గారి పాత సినిమా ఒకదాన్ని చూపించారు. అది మర్చిపోలేని అనుభవం. సెట్లో ఉండే వాళ్లంతా ఇక్కడ దొరికే చీరలను నాకు గిఫ్ట్ గా ఇస్తున్నారు. ఏంతో సంతోషంగా ఉంది’ అంటూ తన అనుభవాలను పంచుకున్నారు. ఇకపోతే దర్శకుడు క్రిష్ ఈ చారిత్రాత్మక చిత్రాన్ని 2017 సంక్రాంతి కానుకగా విడుదలచేయాలని ప్లాన్ చేస్తున్నాడు.