2021 ట్విట్టర్ టాప్ 10 సౌత్ ఇండియా సినిమాలు ఇవే..టాప్ 5లో “వకీల్ సాబ్”

Published on Dec 12, 2021 1:59 pm IST


దిగ్గజ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో ట్విట్టర్ కూడా ఒకటని అందరికీ తెలిసిందే. రీచ్ ప్రేమగా సినిమా ప్రమోషన్స్ పరంగా ట్విట్టర్ కి ప్రపంచ స్థాయి సినిమా దగ్గర మంచి క్రేజ్ ఉంది. అయితే వారు ప్రతీ ఏటా కూడా దేశంలో ఎక్కువగా ట్రెండ్ అయ్యిన అంశాలు అన్నీ కూడా డిసెంబర్ నెలలో రివీల్ చేస్తుంటారు. అలా ఈ ఏడాది సౌత్ ఇండియన్ సినిమాకి వచ్చినట్టయితే టాప్ 10 మూవీస్ వారి జాబితాలో ట్రెండ్ అయ్యిన లిస్ట్ ని రివీల్ చేశారు.

మరి ఇందులో టాప్ 5 స్థానంలో పవర్ స్టార్ మాస్ కం బ్యాక్ సినిమా “వకీల్ సాబ్” నిలవగా టాప్ 6 లో ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ రాజమౌళి “రౌద్రం రణం రుధిరం” 7 లో సూపర్ స్టార్ మహేష్ బాబు “సర్కారు వారి పాట”, 8లో ఐకాన్ స్టార్ “పుష్ప” చిత్రాలు తెలుగు సినిమా నుంచి నిలవగా నెంబర్ 1 స్థానంలో మాస్టర్, 2. వలిమై, 3. బీస్ట్, 4. జై భీమ్ అలాగే 9 లో డాక్టర్ అలాగే 10 లో కేజీయఫ్ చాప్టర్ 2 చిత్రాలు నిలిచాయి.

సంబంధిత సమాచారం :