చిరు “గాడ్‌ఫాదర్”లో సత్యదేవ్ రీప్లేస్‌పై క్లారిటీ..!

Published on Nov 18, 2021 2:24 am IST


మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మలయాళ చిత్రం లూసిఫర్ రీమేక్ “గాడ్ ఫాదర్” సినిమా ఒకటి. మోస్ట్ ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమయ్యింది. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవికి తమ్ముడి పాత్రలో హీరో సత్యదేవ్ నటిస్తున్నాడన్న సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమాలో సత్యదేవ్‌కి భార్యగా నయనతార నటిస్తుందని, కానీ తన వయసుకు సత్యదేవ్ సరిపోడని, అతడిని రీప్లేస్ చేయాలని నయన్ కోరినట్టు వార్తలు వినిపించాయి. కానీ ఈ చిత్ర యూనిట్ నుంచి అందిన సమాచారం ప్రకారం సత్యదేవ్ రీప్లేస్ చేయబడ్డాడనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ఖచ్చితంగా అతడు ఈ సినిమాలో భాగమవుతాడని, జనవరి నుండి చిత్ర యూనిట్‌తో కూడా జాయిన్ అవుతాడని తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :