కన్ఫర్మ్ : ప్రభాస్ “రాధే శ్యామ్” థియేటర్స్ లోనే..!

Published on Jan 27, 2022 7:02 am IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు పలు భారీ సినిమాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి వీటిలో ఆల్రెడీ షూటింగ్ దశలో కొన్ని ఉండగా మరికొన్ని షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నవి కూడా ఉన్నాయి. అయితే వీటిలో దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా సినిమా “రాధే శ్యామ్” రిలీజ్ కి కూడా రెడీగా ఉంది. మరి కరోనా వల్ల మళ్లీ వాయిదా పడ్డ ఈ సినిమాపై నిన్నటి నుంచి ఓ ఆసక్తికరమైన టాక్ వైరల్ అవుతుంది.

ఈ సినిమా డైరెక్ట్ ఓటీటీ లో రిలీజ్ అవుతుంది అని అనేక ఊహాగానాలు వైరల్ అవ్వడం మొదలు పెట్టాయి. మరి వీటికి గాను చెక్ పెడుతూ సినిమాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తున్న థమన్ ఈ చిత్రం కేవలం థియేటర్స్ లోనే రిలీజ్ అవుతుందని కన్ఫర్మ్ చేసాడు. గ్రాండ్ విజువల్స్, గ్రాండ్, మేకింగ్, గ్రాండ్ సౌండ్ ఎఫెక్ట్స్ తో ఈ సినిమా బ్లాక్ బస్టర్ లా ఉంటుందని. నేను కూడా మీ అందరితో కలిసే థియేటర్స్ లోనే చూస్తానని, సినిమా ధియేటర్స్ లోనే రిలీజ్ అవుతుంది అని తాను కూడా తెలిపాడు. సో ఈ భారీ సినిమాపై స్ప్రెడ్ అవుతున్న స్పెక్యులేషన్స్ లో ఎలాంటి నిజం లేదని చెప్పాలి.

సంబంధిత సమాచారం :