ఓటిటిలో “బేబి” తమిళ్ రిలీజ్ పై క్లారిటీ!

Published on Sep 26, 2023 8:00 pm IST

రీసెంట్ గా టాలీవుడ్ లో రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో సెన్సేషన్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం “బేబి” కూడా ఒకటి. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆనంద్ దేవరకొండ హీరోగా టాలెంటెడ్ తెలుగు నటి వైష్ణవి చైతన్య హీరోయిన్ గా దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించిన ఈ చిత్రం భారీ సక్సెస్ ని అందుకొని కాసుల వర్షాన్ని కురిపించింది. మరి ఈ సినిమా ఓటిటి లో వచ్చిన తర్వాత కూడా అందులో మాసివ్ రెస్పాన్స్ ని క్లాక్ చేయగా గత కొన్నాళ్ల నుంచి సినిమా తమిళ వెర్షన్ ఓటిటిలో కూడా వస్తుంది అని రూమర్స్ ఉన్నాయి.

అయితే లేటెస్ట్ గా తమిళ సినీ సోషల్ మీడియా వర్గాలు బేబి తమిళ్ వెర్షన్ ఆహా తమిళ్ లో రిలీజ్ చేస్తున్నారు అని స్ప్రెడ్ చేస్తుండగా వీటిపై నిర్మాత ఎస్ కె ఎన్ అయితే అలాంటిది ఏమి లేదని సింపుల్ గా తేల్చి పారేసాడు. దీనితో బేబి తమిళ్ వెర్షన్ రిలీజ్ లేదనే చెప్పాలి. ఇక ఈ చిత్రానికి సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ సెన్సేషనల్ ఆల్బమ్ ని అందించాడు.

సంబంధిత సమాచారం :