‘బ్యాచ్ లర్’ స్ట్రీమింగ్ పై క్లారిటీ..అప్పుడే అయితే కాదు.!

Published on Oct 17, 2021 10:00 am IST

అక్కినేని యంగ్ హీరో అఖిల్ అక్కినేని హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్”. దర్శకుడు ‘బొమ్మరిల్లు’ భాస్కర్ తెరకెక్కించిన ఈ చిత్రంతో అఖిల్ కెరీర్ లో సాలిడ్ హిట్ ని అందుకున్నాడు. అయితే మరి ఈ చిత్రం హిట్ అయ్యి మంచి వసూళ్లతో నడుస్తుండగా అప్పుడే ఈ సినిమా స్ట్రీమింగ్ కి వచ్చేస్తుంది అని టాక్ రాగా దీనిపై క్లారిటీ వినిపిస్తుంది.

వచ్చే నవంబర్ 12 ఈ చిత్రం ‘ఆహా’లో స్ట్రీమింగ్ కి వస్తుంది అనే దానిపై నిర్మాత ఎస్ కె ఎన్ క్లారిటీ ఇచ్చారు. ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని స్ట్రీమింగ్ కి రావడానికి కాస్త టైం పడుతుంది అని కన్ఫర్మ్ చేశారు. సో నవంబర్ లో ‘బ్యాచ్ లర్’ చిత్రం స్ట్రీమింగ్ అనేది ఉండదు అనేది క్లియర్ అయ్యిపోయింది. ప్రస్తుతానికి అయితే ఈ చిత్రం డీసెంట్ వసూళ్లతో దూసుకెళ్తున్నట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

సంబంధిత సమాచారం :

More