పవన్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ పై క్లారిటీ.!

Published on May 27, 2023 7:10 am IST


ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తన కెరీర్ లో హై ఇచ్చే సాలిడ్ లైనప్ లో అయితే బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాల లైనప్ లో అయితే లేటెస్ట్ గా మరో ఊహించని కాంబినేషన్ ఉండబోతుంది అని క్రేజీ గాసిప్ రాగా ఇప్పుడు దీనిపై క్లారిటీ తెలుస్తోంది. లేటెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కోలీవుడ్ క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో అయితే సినిమా ఉందని సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తారని ఆల్రెడీ పవన్ తో కూడా మాట్లాడేశారు అని రూమర్స్ వచ్చాయి.

అయితే అసలు ఈ టాక్ లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. కేవలం ఇవన్నీ రూమర్స్ మాత్రమే అని ఇప్పుడు సమాచారం. ఇప్పటికే పవన్ మొదట ఏ సినిమా కంప్లీట్ చేస్తారో అర్థం కాని పరిస్థితి ఇక ఈ సమయంలో లోకేష్ తో ఉన్నా ఎప్పటికి ఉంటుందో ఎప్పటికి కంప్లీట్ అవుతాయో అనేదే ప్రశ్నార్థకం. ఒకవేళ ఇది ఉన్నా మొదట అయితే పవన్ ఫ్యాన్స్ ఆ “హరిహర వీరమల్లు” కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నారు.

సంబంధిత సమాచారం :