‘బిచ్చగాడు – 2’ తెలుగు రాష్టాల మూడు రోజుల కలెక్షన్ వివరాలు

Published on May 22, 2023 4:00 pm IST

విజయ్ ఆంటోనీ హీరోగా నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహించిన లేటెస్ట్ థ్రిల్లింగ్ యాక్షన్ ఎమోషనల్ మూవీ బిచ్చగాడు 2. ఈ మూవీలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటించగా దీనిని ఫాతిమా విజయ్ ఆంథోనీ గ్రాండ్ లెవెల్లో నిర్మించారు. మంచి అంచనాలతో మూడు రోజుల క్రితం తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్ తో దూసుకెళుతోంది.

కాగా గడచిన మూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 9.5 కోట్ల గ్రాస్ కలెక్షన్ ని ఈ మూవీ కొల్లగొట్టింది. మరోవైపు అటు తమిళ్ లో కూడా తమ మూవీ బాగానే కలెక్షన్ రాబడుతుండడంతో యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాలో దేవ్ గిల్, జాన్ విజయ్, యోగి బాబు మరియు ఇతర పాత్రలు పోషించగా విజయ్ ఆంటోని సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :